అప్పుల బాధతో కండక్టర్ మృతి
NEWS Sep 09,2025 02:14 pm
కథలాపూర్ మండల కేంద్రంలోని కథలాపూర్ గ్రామ శివారులో కండక్టర్ లక్ష్మీనారాయణ అప్పుల బాధతో బలవన్మరణంకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం లక్ష్మీనారాయణ గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో గురి అవుతున్నట్లు, చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురై కథలాపూర్ గ్రామ శివారుణ మర్రిచెట్టుకు ఉరి వేసుకున్నట్లు తెలిపారు. మృతునికి ఇద్దరు కొడుకులు, భార్య ఉన్నారు. ఎస్సై నవీన్ కుమార్, సంఘటన స్థలాన్ని పరిశీలించి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.