వెలగలపాలెంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
NEWS Sep 09,2025 02:17 pm
లబ్ధిదారులందరికీ సక్రమంగా రేషన్ అందాలని సంకల్పంతో రాష్ట్ర కూటమి ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని వెలగల పాలెం సర్పంచ్ ఇరవాడ రత్నకుమారి అన్నారు. మంగళవారం వెలగల పాలెం పంచాయితీ పరిధిలో గల గ్రామాల్లో రేషన్ కార్డుల లబ్ధిదారులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం డిఏ, వీఆర్వో చిరంజీవి, పంచాయతీ వార్డు మెంబర్లు రాంబాబు , సత్యవతి, కొండబాబు, లబ్ధిదారులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.