జీనబాడులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి!
NEWS Sep 09,2025 01:39 pm
ఆనంతగిరి మండలం జీనబాడు పంచాయతీలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు గండి సురేష్, పంచాయతీ వార్డ్స్ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం, మంగళవారం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణి చేసారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ప్రజలు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల అక్రమాలకు చెక్ పెట్టవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, సెక్రటరీ రమ్య, విఆర్ఓ ప్రశాంతి, మాజీ ఎంపీటీసీ గంగునాయుడు, వార్డ్ మెంబర్స్, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.