APTF మండల కార్యవర్గం ఎన్నిక
NEWS Sep 09,2025 06:52 pm
జి.మాడుగుల మండలంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. మండల అధ్యక్షులుగా సొలబం సింహాచలం నాయుడు, ప్రధాన కార్యదర్శిగా సరమండ ధనుంజయ్ ను మండల ఉపాధ్యక్షులుగా మోస్య రవి, మాసాడి శ్రీనివాస్, కోరాబు నాగమణిని కార్యదర్శులుగా ఉగ్రెంగి ధర్మారావు, వండ్లబు సత్యనారాయణ నాయుడు, విజయకుమార్, టీ.కళ్యాణి, జిల్లా కౌన్సిలర్స్ గా కోరాబు రంజన్ కుమార్, అంగనైని రామచంద్రుడు, అడపా నీలకంఠం నాయుడు అంబిడి అనసూయ, కోరాబు నాగమణిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి శెట్టి శాంతకుమారి వ్యవహరించారు.