ఎంపీపీ ఆధ్వర్యంలో స్మార్ట్ కార్డ్స్ పంపిణీ
NEWS Sep 09,2025 07:26 pm
జి.మాడుగుల ఎంపీపీ అప్పలరాజు సమక్షంలో వాకపలి గ్రామంలో స్మార్ట్ కార్డ్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న స్మార్ట్ కార్డ్స్ లను సంబంధిత అధికారుల కోరిక మేరకు ఎంపీపీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సుమారు 700 కుటుంబాలకు కార్డులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తల్లే సూరిబాబు, టీడీపీ నాయకులు చిరంజీవి,
విఆర్ఓ, తదితరులు పాల్గొన్నారు.