గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ఫలితాలు రద్దు
NEWS Sep 09,2025 11:26 am
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేసింది. ఇప్పటి వరకు ప్రకటించిన గ్రూప్–1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది . గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల పేపర్లను రీవాల్యుయేషన్ చేసి, దాని ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. ఒకవేళ సాధ్యం కాకపోతే, పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని స్పష్టం చేసింది.