అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్
NEWS Sep 09,2025 10:12 am
దసరా సందర్భంగా అమెజాన్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను ఈ నెల 23 నుంచి ప్రారంభించనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్, నిత్యావసరాలు వంటి అనేక రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు లభిస్తాయి. అమెజాన్ వివిధ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ఇస్తున్నట్టు అమెజాన్ తెలిపింది. అమెజాన్ పండుగ సీజన్ కోసం తమ కార్యకలాపాలను పెంచుకోవడానికి రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెట్టింది.