ఏపీలో 9 రోజుల పాటు దసరా సెలవులు
NEWS Sep 09,2025 10:06 am
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2, 2025 వరకు 9 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. దసరా పండగ అక్టోబర్ 2న వస్తుంది. సుదీర్ఘ సెలవుల అనంతరం పాఠశాలలు అక్టోబర్ 3న తెరుచుకోనున్నాయి. క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు మొత్తం 6 రోజులు దసరా సెలవులు ఉంటాయి.