అల్లు అర్జున్ కుటుంబానికి బిగ్ షాక్ ఇచ్చింది జీహెచ్ఎంసీ. జూబ్లీహిల్స్ లోని అల్లు బిజినెస్ పార్క్ భవనంపై అక్రమ నిర్మాణం చేశారంటూ బల్దియా నోటీసు జారీ చేసింది. ఎందుకు కూల్చవద్దో చెప్పాలంటూ షోకాజ్ నోటీస్ ఇచ్చారు సర్కిల్ 18 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్. తక్షణమే స్పందించాలని లేకపోతే కూల్చడం ఖాయమని పేర్కొన్నారు.