వైసీపీ ప్రతిపక్షం కాదు విష వృక్షం
NEWS Sep 09,2025 08:25 am
వైసీపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఓ వైపు కూటమి సర్కార్ ప్రజా పాలన అందిస్తుంటే నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. వైసీపీ ప్రతిపక్షం కాదని అది ఓ విష వృక్షం లాగా మారిందంటూ మండిపడ్డారు. జగన్ , ఆయన పరివారం ఎంతగా దుష్ప్రచారం చేసినా జనం నమ్మే స్థితిలో లేరన్నారు. ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తుంటే తట్టుకోలేక పోతున్నారంటూ ఎద్దేవా చేశారు. 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా బుద్ది రాలేదన్నారు.