ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం లేదు
NEWS Sep 09,2025 07:52 am
రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు కొట్టుకుంటున్నారని, ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఈ రాష్ట్ర రైతాంగాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. 20 రోజుల కిందట తాము హెచ్చరించినా కేంద్రం, రాష్ట్రం స్పందించ లేదన్నారు. అందుకే 70 లక్షల రైతన్నల తరుపున తాము ఉప రాష్ట్రపతి ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తాము ఎన్డీఏకు ఇండియా కూటమికి సబార్డినేట్ కాదన్నారు. తెలంగాణ ప్రజలకు మాత్రమే సబార్డినేట్ గా ఉంటామన్నారు.