నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక
NEWS Sep 09,2025 07:44 am
ఉప రాష్ట్రపతి ఎన్నిక మంగళవారం జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగుస్తుంది. 6 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. లోక్‌సభ, రాజ్యసభ కలిపి మొత్తం 786 ఓట్లు ఉండగా.. 394 ఓట్లు వచ్చిన వారు వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవుతారు. ప్రస్తుతం ఎన్డీయేకి 425, ఇండియా కూటమికి 324 మంది సభ్యుల బలం ఉంది.