ఏపీ నుంచి ప్రతి రోజూ షిర్డీకి రైలు
NEWS Sep 09,2025 07:37 am
మోదీ సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది ఏపీ రాష్ట్రానికి. తిరుపతి-షిర్డీ మధ్య రోజూ రైలు నడపాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఆయన చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రోజూ వేలాది మంది మరాఠా నుంచి పెద్ద ఎత్తున తిరుపతి పుణ్య క్షేత్రానికి వస్తుంటారని, అందుకే వారంతాంలో రెండు మూడు సార్లు కాకుండా ప్రతి రోజూ రైలు నడిపించాలని కోరారు.