డ్రగ్స్ దొరికితే సర్కార్ నిద్ర పోతోందా..?
NEWS Sep 09,2025 07:23 am
తెలంగాణ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. మేడ్చల్ జిల్లాలోని చర్లపల్లి కేంద్రంగా భారీ ఎత్తున మహారాష్ట్ర పోలీసులు వల పన్ని వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టుకున్నారని మరి హోం శాఖ, ఎక్సైజ్ శాఖలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. సీఎం, మంత్రి జూపల్లి నిద్ర పోతున్నారా అని మండిపడ్డారు. ఈ సందర్భంగా భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసిన మరాఠా పోలీసులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.