3 నుంచి 9 గంటల మధ్యే ప్రమాదాలు
NEWS Sep 08,2025 10:05 pm
రోడ్డు ప్రమాదాలు అనగానే నిద్ర ముంచుకువచ్చే అర్ధరాత్రి దాటాకనో, తెల్లవారుజాము సమయంలో అధికంగా జరుగుతాయని అనుకుంటాం. కానీ నిజం వేరే. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగేది.. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల మధ్యే. ఈ 6 గంటలు రోజులో 25 శాతంతో సమానం. కానీ ఏకంగా 38.4 శాతం ప్రమాదాలు ఇంటికి చేరే సమయంలోనే జరుగుతున్నాయి. ఈ వాస్తవాన్ని కేంద్ర రహదారి రవాణాశాఖ 2023 నివేదికలోని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.