నల్లప్పగారి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం
NEWS Sep 08,2025 04:42 pm
చిట్వేల్‌కు చెందిన, ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడిన కార్య లక్ష్మీదేవి కుటుంబం, రిటైర్డ్ AEO నల్లప్ప గారి వర్ధంతి సందర్భంగా రాపూర్ రోడ్డులోని శ్రీ దత్తగిరి నారాయణ తపోవన ఆశ్రమంలో వృద్ధులకు బియ్యం, పండ్లు, కూరగాయలు, ధూప దీప సామగ్రి అందించారు. అనంతరం అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఆలయ పీఠాధిపతి నాగేశ్వరమ్మ గారు ఆశీర్వచనాలు అందిస్తూ కుటుంబానికి ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.