ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీలు
NEWS Sep 08,2025 08:51 pm
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేశారు సీఎం చంద్రబాబు. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ , ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు, మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా సౌరభ్ గౌర్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్యామలారావు, ఎక్సైజ్, మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముకేష్ కుమార్ మీనా, అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ (ఢిల్లీ)గా ప్రవీణ్‌కుమార్ బదిలీ చేశారు.