డ్రగ్స్ తయారీపై నివేదిక సమర్పించాలి
NEWS Sep 08,2025 08:39 pm
చర్లపల్లి డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీపై సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాపై మరింత గట్టి నిఘా పెట్టాలన్నారు. ఎక్సైజ్, పోలీసులు సమన్వయంతో పని చేయాలన్నారు.