ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ ను మరోసారి టీటీడీ ఈవోగా నియమించారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 2017లో ఆయన ఈవోగా పని చేశారు. నిజాయితీ కలిగిన ఆఫీసర్ గా గుర్తింపు పొందారు. తను ఉత్తరాదికి చెందిన వారని విమర్శలు వచ్చినా పట్టించు కోలేదు.