పార్టీ నాయకులతో కలెక్టర్ సమీక్ష
NEWS Sep 08,2025 10:16 pm
ఎన్నికల నిర్వహణలో భాగంగా తయారుచేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను పోలింగ్ స్టేషన్లలో రాజకీయ పార్టీ నాయకులకు అందజేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు. సోమవారం జిల్లా ఐడిఓసి కార్యాలయంలో రాజకీయ నాయకులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం 2వ సాధారణ ఎన్నికలు (ఎంపీటీసీ/జెడ్పిటిసి-2025) జరగనున్నాయని తెలిపారు. జాబితాలో సవరణలు ఉంటే వెంటనే తెలియజేయాలని కోరారు.