ప్రతి గ్రామానికి రహదారి నిర్మిస్తాం : ఎమ్మెల్యే పాయం
NEWS Sep 08,2025 08:39 pm
గ్రామ గ్రామానికి రహదారులను నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం పినపాక మండలం అమరారం , కిష్టాపురం కలుపుతూ 80 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సునీల్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం, మండల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.