బీజేపీ జేబు సంస్థగా మారిన ఈసీ
NEWS Sep 08,2025 06:34 pm
మాజీ కేంద్ర మంత్రి మోదీ సర్కార్ పై భగ్గుమన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మోదీ, షా, బీజేపీ పరివారానికి జేబు సంస్థగా మారి పోయిందని సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎంల కంటే బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈసీ భ్రష్టు పట్టి పోయిందన్నారు. బీహార్ లో 65 లక్షలు ఒకే సారి ఎలా తీసి వేస్తారంటూ ప్రశ్నించారు. జవాబుదారీతనం లోపించిందన్నారు. ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పోతోందన్నారు.