అశ్వాపురం మండలం జగ్గారం వద్ద ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది సోమవారం సాయంత్రం ఖమ్మం నుండి మణుగూరు వస్తున్న ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణాపాయం కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం పై అశ్వాపురం పోలీసులకు సమాచారం అందగానే సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.