మండల స్థాయి క్రీడా ఎంపిక పోటీలు ప్రారంభం
NEWS Sep 08,2025 06:36 pm
పినపాక మండల స్థాయి క్రీడా ఎంపికలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బయ్యారం లో సోమవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. అండర్ 14, అండర్ 17 విభాగాలలో బాలురు, బాలికలు కబడ్డీ, కోకో, వాలీబాల్ క్రీడాంశాలలో మండల స్థాయి టీములను ఎంపిక చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి కొమరం నాగయ్య తెలిపారు. పినపాక, కరకగూడెం మండలాల మండల స్థాయి టీములతో ఈ నెల 9న జోనల్ స్థాయి టీమ్ ల ఎంపికకు ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ముఖ్య అతిథులుగా తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీవో సునీల్ కుమార్, ఎస్సైసురేష్ , పినపాక జెడ్పి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాల్గొన్నారు