జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలి
NEWS Sep 08,2025 04:46 pm
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఓటు వేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ ఎంపీలు సుదర్శన్‌రెడ్డికి ఓటు వేయాలని కోరారు. తనను ఓడించిన కూటమి అభ్యర్థికి జగన్ ఎందుకు మద్దతు తెలుపుతున్నారో అర్థం కావడం లేదన్నారు.. మోడీ, అమిత్‌షా ఉన్న ఉప రాష్ట్రపతిని పారిపోయేలా చేశారని ఆరోపించారు. ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేస్తే ఆర్‌ఎస్ఎస్ భావజాలం అంగీకరించినట్లేనని పేర్కొన్నారు.