పశువైద్య సేవల కోసం పాడిరైతుల ఆవేదన
NEWS Sep 08,2025 05:00 pm
వడ్డాది పశువుల ఆసుపత్రిలో గత 4 నెలలుగా వైద్య సేవలు అందక పాడిరైతులు, జీవాల పెంపకందారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి పశువైద్యాధికారిని బదిలీ చేసినప్పటికీ కొత్త డాక్టర్‌ను నియమించకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆఫీసులో సబార్డినేట్ రమ ఒక్కరే పనిచేస్తూ ఆసుపత్రి నిర్వహణ చూసుకుంటున్నారు. అయితే డాక్టర్ లేకపోవడంతో వైద్య సేవలు అందకపోవడమే కాక, గత మూడు నెలలుగా ఆమెకు జీతాలు కూడా అందలేదని పాడిరైతు అదట్రావు తమన్న దొర తెలిపారు.