బుచ్చయ్యపేటలో పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్
NEWS Sep 08,2025 04:59 pm
వర్షాకాలంలో ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా బుచ్చయ్యపేటలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. సర్పంచ్ సుంకర లక్ష్మీ పర్యవేక్షణలో పారిశుద్ధ్య సిబ్బంది డ్రైనేజీలో పేరుకుపోయిన పూడిక, చెత్తాచెదారం తొలగించారు. ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు తీయగా, బ్లీచింగ్ జల్లి, దోమల మందు పిచికారి చేశారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అవగాహన కల్పించారు.