రాష్ట్రంలో ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని వాపోయారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కనీస మద్దతు ధర కల్పించడంలో సర్కార్ విఫలం అయ్యిందన్నారు. ఎన్నిసార్లు నెత్తి నోరు మొత్తుకున్నా పట్టించు కోలేదన్నారు. గిట్టు బాటు ధర రాక అల్లాడుతుంటే ఆదుకోవాల్సింది పోయి సోయి లేకుండా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. సోమవారం కర్నూల్ మార్కెట్ యార్డును సందర్శించారు.