ఎరువుల కొరత వదంతులు నమ్మవద్దు
NEWS Sep 08,2025 04:05 pm
బుచ్చయ్య పేట మండలంలో ఎరువుల కొరత లేదని, రైతులు వదంతులు నమ్మవద్దని అధికారులు తెలిపారు. ఎంపీడీవో బానోజీరావు, తహసీల్దార్ లక్ష్మి, ఏవో భాస్కరరావు, అడిషనల్ ఎస్సై భాస్కర్ సంయుక్తంగా సోమవారం మాట్లాడారు. వరి సాగు విస్తీర్ణం 2399 హెక్టార్లు కాగా ఇప్పటివరకు 2034 హెక్టార్లలో వరి నాట్లు పూర్తయ్యా యన్నారు. వరికి 370 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 332 టన్నులు యూరియా సరఫరా చేసామన్నారు.