రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
NEWS Sep 08,2025 03:28 pm
ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ఎన్నికల సమయంలో నన్ను గెలిపించమని రేవంత్ రెడ్డి నా సహాయం కోరాడని అన్నారు. అలాంటి వ్యక్తి మా బీహార్ ప్రజలు లేబర్స్‌గా పని చేయడానికే పనికొస్తారని అవమానించాడని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల డీఎన్ఏ కన్నా.. బీహార్ ప్రజల డీఎన్ఏ చెత్తగా ఉంటుందని చెప్పుకొచ్చాడని ఫైర్ అయ్యారు. బీహారోళ్లను అవమానించే ధైర్యం అతనికి ఎక్కడిదని, రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.