కరకగూడెంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలి
NEWS Sep 08,2025 04:58 pm
కరకగూడెం మండల కేంద్రంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మాదాసు అఖిల్ డిమాండ్ చేశారు. సోమవారం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో బస్టాండ్ లేక విద్యార్థులు, ప్రజలు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు రోడ్డు మీద ఆగకపోవడంతో విద్యార్థులు, ప్రయాణికులు రోడ్డు పక్కన పడిగాపులు కాచే దుస్థితి నెలకొన్నదని వాపోయారు. వెంటనే బస్టాండ్ ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.