మేడారం అభివృద్ధి పనులు పూర్తి కావాలి
NEWS Sep 08,2025 03:21 pm
సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 100 రోజుల్లో మేడారం అభివృద్ది పనులు పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. ఇందు కోసం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మేడారం, బాసర ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను సీఎంకు వివరించారు అధికారులు. మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు. పూర్తిగా సహజ సిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వారంలో మేడారంకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తానని స్పష్టం చేశారు.