నవోదయ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం కరకగూడెంలో జవహర్ నవోదయ పాఠశాల ను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు . స్వయంగా అక్కడ గల సౌకర్యాలను పరిశీలించారు . విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.