ఫేక్ ఫోన్‌పే మెసేజ్‌తో ఫ్రాడ్ ప్రయత్నం
NEWS Sep 08,2025 03:12 pm
చిట్వేల్‌కు చెందిన శివకు సెప్టెంబర్ 8న మధ్యాహ్నం 12:30 గంటలకు డాక్టర్ సంజయ్ గుప్తా పేరుతో ఒక వ్యక్తి వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. సీలింగ్ ఫ్యాన్ కావాలని చెప్పి ఫోన్‌పేలో ₹17,000 పంపినట్లు నకిలీ టెక్స్ట్ పంపి, తిరిగి డబ్బు రిటర్న్ చేయమని ఒత్తిడి చేశాడు. కానీ శివ జాగ్రత్తగా చెక్ చేసి మోసపోకుండా తప్పించుకున్నారు. ఇలాంటివి ఎదురైతే 1930కి ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.