ప్రతి సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి
NEWS Sep 08,2025 03:13 pm
కలెక్టర్ ఆదేశాల మేరకు మండల తాసిల్దార్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహించబడునని మణుగూరు తాసిల్దార్ అద్దంకి నరేష్ తెలియజేశారు. వృద్ధులు ,వికలాంగులు శిశువులతో వచ్చిన మహిళలకు ప్రాధాన్యత ముందుగా ఇస్తామన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమం కు ఎంపీడీవో, వ్యవసాయం, పంచాయతీరాజ్, విద్యాశాఖ, ఆరోగ్యశాఖ అధికారులు హాజరు కావాలన్నారు.