మిట్టగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
NEWS Sep 08,2025 03:14 pm
అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఇటుకల లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.