దేవాలయాల్లో వరుసగా హుండీ చోరీలు
NEWS Sep 08,2025 11:26 am
బుచ్చయ్యపేట మండల కోమల్లపూడి పంచాయతీలో రెండు దేవాలయాల హుండీలు వరుసగా చోరీకి గురయ్యాయి. శుక్రవారం సాయిబాబా ఆలయంలో హుండీని చెరిపి నగదు దోచుకెళ్లారు. దానిలో సుమారు రూ.50 నుండి రూ.60 వేలు ఉండొచ్చని ప్రధాన అర్చకులు తెలిపారు. ఇదిలా ఉండగా, అదే పంచాయతీ పరిధిలోని బుదిరెడ్లపాలెం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున నూకల తల్లి ఆలయ హుండీని కూడా దొంగలు ఖాళీ చేశారు. అక్కడ సుమారు రూ.25 వేలు ఉండొచ్చని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దేవాలయాలకు రక్షణ కల్పించాలని వారు పోలీసులను కోరుతున్నారు.