మెడికల్ కాలేజీలపై చర్చకు సిద్దం
NEWS Sep 08,2025 01:17 pm
మెడికల్ కాలేజీలపై వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియ చేసేందుకు తాను చర్చించేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు మంత్రి సత్య కుమార్ యాదవ్. వైసీపీకి దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. లేకపోతే ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు. తాను ఎప్పుడైనా, ఎక్కడైనా సరే చర్చించేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. జగన్ దమ్ముంటే చర్చకు రావాలన్నారు.