వాగ్దేవి ల్యాబ్ పై ఎక్సైజ్ పోలీసుల దాడులు
NEWS Sep 08,2025 12:17 pm
చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి నెల రోజుల ముందే వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్‌లో రోజువారీ కూలీగా చేరాడు ముంబై కానిస్టేబుల్. అక్కడి ముడి సరుకులు, రసాయనాలు, డ్రగ్స్ తయారీపై నిఘా ఉంచాడు. పక్కా ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. డ్రైవర్లు, రోజువారీ కూలీలుగా మరికొంత సిబ్బందిని పంపించింది ముంబై బ్రాంచ్.. డ్రగ్స్ అని నిర్ధారించుకున్న తర్వాతే అధికారులు సోదాలు చేపట్టారు. సోమవారం వాగ్దేవి ల్యాబ్ పై దాడులు చేపట్టింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ.