ASR:ఆశ్రమ పాఠశాలలపై అధికారులు నిర్లక్ష్యం
NEWS Sep 08,2025 12:20 pm
రంపచోడవరం డివిజన్ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయని, విద్యార్థుల ప్రాణాలతో అధికారులు ఆటలాడుతున్నారని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో చదువుకుంటున్న గిరిజన విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఆరోగ్య సమస్యలు వచ్చినా వెంటనే వైద్యం అందించక పోవడంతో గత ఏడాది కాలంలో అనేక మంది విద్యార్థులు మరణించారు. విద్యార్థుల ప్రాణాలను ఇలా నిర్లక్ష్యం చేయడం మానవత్వానికి విరుద్ధం అని తీవ్రంగా విమర్శించారు.