ASR: సహా చట్టానికి తూట్లు: బాబురావు
NEWS Sep 08,2025 01:52 pm
అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలోని 7 మండలాల్లో సమాచార హక్కు చట్టం(RTI Act-2005) అమలు నిర్లక్ష్యం పాలవుతోందని, చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంగిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో అవినీతి ఒక కంచుకోటలా మారిందన్నారు. మరి ముఖ్యంగా రెవెన్యూ శాఖలో విఆర్ఏ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు అవినీతి పగడ్బందీగా సాగుతోందని ఆరోపించారు, ఎస్టీ కులానికి చెందని వారికి నకిలీ సర్టిఫికెట్లు జారీ చేయడానికి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు.