భారత్ విజయం మోదీ సంతోషం
NEWS Sep 08,2025 11:19 am
బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన 2025 ఆసియా కప్‌లో అద్భుతమైన విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టును అభినందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ విజయం మరింత ప్రత్యేకమైనదని, డిఫెండింగ్ ఛాంపియన్స్ దక్షిణ కొరియాను ఓడించడం విస్తు పోయేలా చేసిందన్నారు. ఈ గెలుపు భారత హాకీ, భారత క్రీడలకు గర్వకారణమైన క్షణమని పేర్కొన్నారు. మన ఆటగాళ్ళు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి మరింత కీర్తిని తీసుకు రావాలని కోరారు పీఎం.