ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ విజేతగా నిలిచింది భారత హాకీ జట్టు. ఫైనల్ మ్యాచ్ లో దక్షిణ కొరియాను 4-1 తేడాతో ఓడించింది. అంతకు ముందు సెమీస్ లో చైనాను 7-0 తేడాతో గెలుపొందింది. వచ్చే ఏడాది ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. ఈ కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాడు దిల్ ప్రీత్ సింగ్. ప్రత్యర్థి జట్టుకు చెందిన ఆటగాడు డైన్ సన్ 51వ నిమిషంలో గోల్ చేశాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.