భారత్ రజతం మంత్రి సంతోషం
NEWS Sep 08,2025 09:26 am
ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్ రజతం సాధించడం పట్ల స్పందించారు ఏపీ క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి . వెన్నం జ్యోతి, సురేఖ జోడీ ఫైనల్‌లో జరిగిన హోరాహోరీ పోరులో ఉత్తమ ప్రతిభ కనబరిచారని , దేశానికి మంచి పేరు తీసుకు వచ్చారని ప్రశంసించారు. తమ కూటమి ప్రభుత్వం క్రీడాభివృద్ది కోసం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఈసారి బడ్జెట్ లో అత్యధికంగా కేటాయించామన్నారు. మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెడతామన్నారు.