ఉమ్మడి వరంగల్ జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. పలు చోట్ల కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రెండు బస్సులు నీటిలో చిక్కు కోవడంతో ట్రాఫిక్ పోలీసులు బస్సులలో ప్రయాణిస్తున్న 100 ప్రయాణీకులను రక్షించారు. చాలా చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. వాహనాల రాక పోకలు పలు చోట్ల నిలిచి పోయాయి. ఇప్పట్లో వర్షం తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.