విశాఖలో పిడుగుతో పాటు భారీ వర్షం
NEWS Sep 08,2025 08:24 am
విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీపై పిడుగు పడింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్బివేశారు. విశాఖలో అగ్నిప్రమాద ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. అగ్నిమాపకశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు.