గ్రాండ్‌గా 'బిగ్‌బాస్' సీజన్-9 లాంచ్!
NEWS Sep 07,2025 10:03 pm
'బిగ్‌బాస్' సీజన్-9లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో 6 గురు కామనర్స్ ఉంటే, 9 మంది సెలబ్రిటీలు ఉన్నారు. 15 మందిని ఇంట్లోకి పంపించి లాక్ వేసేశారు హోస్ట్ నాగార్జున. అయితే చివర్లో ఒక ట్విస్ట్ ఇచ్చారు. ముందు నుంచి చెబుతున్నట్లే ఈసారి రెండు హౌస్ లు ఉండగా.. మెయిన్ హౌస్ ని కామనర్స్ కి కేటాయించారు. ఆల్రెడీ అగ్ని పరీక్ష గెలిచి వచ్చారు కాబట్టి, వారిని ఓనర్స్ గా పేర్కొన్నారు. సెలబ్రిటీలకు అవుట్‌హౌస్‌లో ఉంటారని నాగ్ తెలిపారు.