చిట్వేలి మండలంలోని నేతివారిపల్లె ఎస్.టి. ఎరుకుల కాలనీలో దాసరి ప్రశాంతి (25) అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకొని మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకో ఘటనలో కె.కె. వడ్డేపల్లికి చెందిన రాయన శాంతమ్మ (34) ట్రాక్టర్ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందింది. రెండు ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.