ప్రసిద్ద పుణ్య క్షేత్రం తిరుమల ఆలయం చంద్రగ్రహణం కారణంగా ఆదివారం రాత్రి మూసి వేశారు. సోమవారం ఉదయం వరకు గుడిని మూసి వేస్తున్నట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. గ్రహణం వీడిన తర్వాత మహా సంప్రోక్షణ అనంతరం శ్రీవారు భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు. వెంగమాంబ అన్నదాన సత్రాన్ని కూడా మూసి వేసినట్లు పేర్కొన్నారు.