రోగులకు అసౌకర్యం కలగకుండా వైద్య సేవలు
NEWS Sep 07,2025 06:56 pm
నియోజకవర్గ వ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలలో రోగులకు అసౌకర్యం కలగకుండా అన్ని సేవలు అందించాలని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశించారు . ఆదివారం సాయంత్రం మణుగూరు 100 పడకల ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు . వ్యాధిగ్రస్తులను ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపర్డెంట్ సునీల్, గౌరీ ప్రసాద్, శివాలయం ఆలయ కమిటీ చైర్మన్ కూచిపూడి బాబు పిరినాకి నవీన్ , కాంగ్రెస్ నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.